పుట:Andhrula Charitramu Part-1.pdf/120

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


మఱియొక విష్ణువుగాడు. మధుసూదనదేవుడైన యీ యాంధ్రవిష్ణువునే సందర్శించుటకై పదునాఱవ శతాబ్దారంభమునందు నాంధ్రభోజుడు మూరురాయరగండడు విజయనగరాధీశ్వరుండు విద్యాచక్రవర్తి శ్రీకృష్ణదేవరాయ చక్రవర్తి పూర్వదిగ్విజయ యాత్రకాలమున వచ్చి కానుకలర్పించి పోయి తన విష్ణుచిత్తీయమునందభవర్ణించి యున్నాడు. పూర్వకాలమున జైనులో, బౌద్ధులో పరిపాలనము చేసిరని తెలుపు చిహ్నములిప్పటికి నా సమీప ప్రాంతభూములయందు గానవచ్చుచున్నవి. ఈ మొదటి యాంధ్రరాజులు రెండు శతాబ్దములు పరిపాలనము చేసినట్లుగ గన్పట్టుచున్నను ఆంధ్ర జాతీయులయిన శాలివాహన వంశజులు రాజ్యాధిపత్యము వహించు వఱకు వీరి చారిత్రము గాని, నామములు గాని దెలియరాకున్నవి.

శైవమత వ్యాపనము.

ఈ కాలమునందే యాంధ్రరాజ్యమున శైవమతము ప్రవేశించి వ్యాపించినట్లుగ గాన్పించుచున్నది. ఈ శైవమతము మొదట యక్షులలో (తమిళజాతులలో) వ్యాపించి వారి మూలమున నాంధ్రదేశమున వ్యాపించినది. ఈమతమనార్యులనుండి వచ్చినది కాని కొందఱు తలంచునట్లార్యులనుండి వచ్చినది కాదని తోచుచున్నది. మొట్టమొదటశైవమత మెట్లుత్పత్తి గాంచినదియు దెలిసికొనుట చదువరుల కావశ్యకమనుటకు సందియము లేదు. అదియునుంగాక యీ విషయము మనోహరముగా నుండక మానదు. హిమవత్పర్వతమున కుత్తరమునందలి యున్నత భూములనుండి యక్షులు కొంతకాలమునివసించియుండి మఱి కొంతకాలమైన తరువాత నచ్చటి రేవుపట్టణమగు తామ్రలిప్తి నగరమునుండి సింహళమునకును సింహళమునుండి దక్షిణాపథముయొక్కదక్షిణపు కొనకువచ్చి కాలక్రమము నచ్చట పాండ్య చోళచేరరాజ్యములుస్థాపించిరనియు ఈయక్షులే తామ్రలిప్తి నుండి (Tamalittis) వచ్చిన వారగుటచేతతమిళు (Tamils) లనబడుచున్నారని నాలుగవ ప్రకరణమున వ్రాసినవిషయములను మా చదువరులవగాహనము చేసికొనియే యుందురు. ఈ యక్షులలో బై తరగతులవారికి శివుడు ప్రధాన దైవతముగా నుండెను. శివుడు స్ఫురద్రూప