Jump to content

పుట:Andhrula Charitramu Part-1.pdf/119

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కులమేగాని వేఱొండుగాదు. [1] సుచంద్రుడను నార్యాంధ్రుడొకడు కాకులమును రాజధానిగ జేసికొని పరిపాలనము చేసియుండవచ్చును. ఈ సుచంద్రుడనువాడు జైనమతావలంబకుడై యుండవలయును. ఆంధ్రవిష్ణువీతని కుమారుడు. ఇతడు బహుపరాక్రమశాలియై నిశంభుడను నాగాంధ్రుని జయించి యాంధ్రరాజ్యమును స్థాపించి విజృంభింపజేసి మిక్కిలి ప్రఖ్యాతికెక్కి యుండును. బహుకాలమీతని నామమును గీర్తిని ప్రజలు జ్ఞాపకముంచుకొనియుందురు. ఇటీవల శైవమతము ప్రబలి బౌద్ధక్షేత్రములుగానుండిన శ్రీశైలము, భీమేశ్వరము, కాలేశ్వరములను త్రిక్షేత్రములును శైవక్షేత్రములయిన తరువాత, ఈ దేశమునకు త్రిలింగమను నామము వ్యవహారములోనికి వచ్చిన తరువాత, సుప్రసిద్ధి గాంచిన యీ యాంధ్రవిష్ణువునకు శైవులయిన రాజులును, పండితులును పైగాథను ముడిపెట్టియుందురు గాని, మనము వివేకదృష్టితో నీ గాథలోని సంగతి సందర్భములను జక్కగ బరిశీలించితిమేని నీతడే తప్పక యాంధ్రరాజ్య సంస్థాపకుడై యుండునని తెలిసికొనగలుగుదుము. ఈ యాంధ్రరాజుల పాలనమునందు శ్రీకాకుళమే రాజధానిగా నుండెను. ఆ కాలమునందలి శ్రీకాకులము కృష్ణానది వెల్లువలచే గొట్టుకొనిపోవుటచేత నేడు గానరాకున్నయది. [2] ఆ ప్రదేశమునకు జెంతను నా పేరితో మఱియొక గ్రామము వెలిసినది. అయినను ఆంధ్రవిష్ణువును మాత్రము మఱువక తరువాత వారాతని దైవమునుగా భావించి దేవాలయమును గట్టి యాతనింబూజించుచున్నారు. శ్రీకాకులాంధ్ర దేవుడీ యాంధ్రవిష్ణువేగాని

  1. Dr.Burgess, "The Stupas of Amaravaty and Jaggayyapeta," A.S.S.T., p.3 referring to Wilson, Mackenzie Mss, Vol I intron p.c.xvi.
    The Godavary District Gazetteer ch.2., p.18,-
    Mr.A.D.Campbell's Telugu Grammar, intro. p.ii
    Mr. V.A.Smith's Early History of India, p.195.
  2. The site of the ancient town (N.lat. 20.28; E.long. 85.55) has been cut away by the river (Rea proc. Govt. Madras, Public, No. 423, dated June 19, 1892.)