పుట:Andhrula Charitramu Part-1.pdf/11

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


క్రొత్తయుపనిషత్తులనే వినిర్మించిరి. యథార్థములగు చరిత్రములు లేకపోవుటచేత సత్యమునుండి యసత్యమును విడదీయుటలో గష్టమెక్కుడగుచున్నది. ప్రక్షిప్తభాగమును గ్రంథములందుంజేర్చి యుండుటచేతనే గ్రంథమునందే పరస్పరవిరోధము లుండుటయు దటస్థమగుచున్నది. కాలనిర్ణయమునకు మన గ్రంథాదులు కలిగించు చిక్కులిన్నియన్నియని చెప్పనలవికాదు. విమర్శజ్ఞానము నశించుటచేత గాలవిషయమున మనవారు చర్చింపనే చర్చింపరు. కలియుగారంభమున భారతమును నన్నయభట్టు చెప్పినాడనిన మనవారు విశ్వసించిరి.

దేశచరిత్రమంతయు నిట్లవిద్యాతమంచబుచే జుట్తుకొనబడి యుండుటంజేసి చరిత్రరచనముం జేయవలయునని సంకల్పముద యించినను బహుసంవత్సరములకు గాని నా సంకల్పము నెరవేరునట్టి భాగ్యము పట్టినది కాదు.

బ్రిటీష్పరిపాలనమునకు గృతజ్ఞత.

దేశచరిత్రము యొక్క సత్యమును గూర్చి మన గ్రంథము లెంతయయోమయంబులుగా నున్నను యథార్థ చరిత్రమును దెలిసికొనుటకు వలయు సాధనములను మనపూర్వపు రాజులు మనకొరకు విడిచిపెట్టిపోక యుండలేదు. తమ కాలమును, తమ ధర్మకార్యములను, తమ మతాభిమానములను, తమ ప్రతాపములను తమ దిగ్విజయములను దెలుపునట్టి శానములను వ్రాయించి రాళ్లపైన లోహములపైన నెక్కించి పెట్టియుండిరిగాని, కాలవశంబున నవియన్నియు శిధిలములైపోయియు, మంటిదిబ్బలలో బూడ్చుకొనిపోయియు, చూచువారు లేక పడియుండంగా,