Jump to content

పుట:Andhrula Charitramu Part-1.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దైవానుగ్రహమువలన నిటీవల బ్రిటీష్పరిపాలనము మనకు లభించి మనదేశము యొక్క పురాతనచరిత్రమును దెలిసికొనుటకై మనయుపయోగార్థము దొరతనమువారు వానినన్నిటిని వ్యయప్రయాసములకోర్చి పెల్లగించిపెట్టినను మనవారు వానియుపయోగమును దెలిసికొని సత్యాన్వేషణము చేయజాలక పోయినను చరిత్రరచనయందు నిపుణులగు పాశ్చాత్యపండితులు మాత్రము వానిని బరిశోధించి మనగ్రంథము లెంత తికమకలుగా నున్నను నోపికతో విమర్శించి సులభముగా బ్రసవింపలేక ప్రసవవేదన ననుభవించు చుండిన గర్భవతి గర్భమునుండి బిడ్డను బైకిదీయునట్లుగా దమబుద్ధివిశేషముచే నొక్కొక్క సత్యమునే బయలునకు దీసి ప్రకటించుచు జ్ఞానతేజస్సును బఱపు చుండుటచేత దేశచరిత్రము నావరించుకొనియుండిన యవిద్యాతనుంబంతయు గ్రమక్రమముగా దొలగి పోవుచున్నది. కావున దొరతనమువారికిని, సత్యాన్వేషణపరులయిన పాశ్చాత్య పండితులకును ఆంధ్రులమైన మనము ముఖ్యముగా గృతజ్ఞత దెలుపవలసి యున్నది. మన ప్రాచీనాంధ్రుల యొక్క యౌన్నత్యము బయలుపడుటకు ముఖ్యముగా వీరు చేసిన నిరంతరకృషియే కారణము. ఈ పాశ్చాత్యపండితులు చరిత్రములు వ్రాయుటలో మన గ్రంథములలోని లోపములను గనిపెట్టి గ్రమక్రమముగా వానిని ("lying gabble") అబద్ధపుకూతలని నిరసించివైచి (1) శాసనములను (2) పురాతనపు గట్టడములను (3) మనదేశమును గూర్చి యన్యదేశస్థులు వాసియుంచినవ్రాతలను (4) ప్రసంగాంతరముగల మన గ్రంథవిషయములను (5) దీనికి సంబంధించి యున్నంతవరకు లోకులచే జెప్పుకొనబడు కథలను నా