పుట:Andhravijnanasarvasvamupart2.pdf/71

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

జీవయాత్ర :- జీవక్షేత్రమందు వ్యక్తావ్యములకు ధర్మప్రతిష్ఠ సమకూర్చుటకు భగవద్భక్తి పరమసాధనముగ నున్నది. జీవయాత్రను దేవయాత్రగ జేయగల విధమును వైదిక మతధర్మము లనంతముఖముల నిర్దేశించుచున్నది. దేహధారుల కన్యక్తమును గ్రహించుట దుర్లభము. అవ్యక్తము వ్యక్తముద్వారా గ్రాహ్య మగుచున్నది. జీవయాత్రను విషమయాత్రగ జేయక శివయాత్రగ జేయుటకు జ్నానేంద్రియ కర్మేంద్రియములు మనోబుద్ధి చిత్తాహంకారములు గురులింగజంగమార్చనలందు భక్తిపరవశములు కావలయును. జీవయాత్రను దేహయాత్రార్థము గాక శివయాత్రార్థము చేయవలసిన విధమును అనుభవసారము తెలుపుచున్నది. జీవయాత్రను కైవల్యయాత్రను జేయుటకు బాహ్యలింగధారణమును, అంతర్లింగధారణమును ఉపయోగపడగల విధమును వీరశైవాగమములు బోధించుచున్నవి. ఈ పరమార్థముచే అనుభవసారము నందు సోమనాథుడు విశదము చేసెను.