పుట:Andhravijnanasarvasvamupart2.pdf/72

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

మొదటి యధ్యాయంబున నైతరేయ ద్వితీయారణ్యకంబును, రెండవయధ్యాయంబున దైత్తిరీయాంతర్గతం బగు బ్రహ్మవల్లియు, మూడు నాలు గైదవ యధ్యాయంబులచే గ్రమంబుగ ఛాందోగ్యంబునందలి యుద్దాలక సనత్కుమార ప్రజాతి యుపదేశంబులును, ఆరేడవ యధ్యాయంబులచే ముండకము నందలి యాంగిరపిప్పలాదోపదేశంబులును, ఎనిమిది తొమ్మిదవ యధ్యాయంబులచే ఋగ్వేద కౌషీతకి శాఖయందలి యింద్రాజాతశత్రూపదేశంబులును, పదియవ యధ్యాయంబున మైత్రాయణ్యుపనిషత్తునందలి శాకాయనోపదేశంబును, పదునొకండవ యధ్యాయంబున కఠవల్లియందలి యమోపదేశంబును, పండ్రెండవ యధ్యాయంబున శ్వేతాశ్వతరోపనిషత్తును, పదుమూడవ యధ్యాయము మొదలు పదునెనిమిదవ యధ్యాయము వరకునుంగల యారధ్యాయంబుల యందును గ్రమంబుగ బృహదారణ్యకాంతర్గతంబులగు మూడవ యధ్యాయ నాల్గవ బ్రాహ్మణ్ంబు, నాలవయధ్యాయమునందలి యజతశత్రు బాలాకి సంవాదము, యజ్నవల్క్యమైత్రేయ సంవాదము, అధర్వణోపదేశంబగు మధువిద్యలును, ఐదవ యధ్యాయంబునదలి యజ్నవల్క్యాశ్వలాదుల వాదక కథయు, నారవ యధ్యాయమందలి యజ్నవల్క్యజనస సంవాదంబును, బందొమ్మిదవ యధ్యాయంబున సామవేద తలవకార శాఖయునును, ఇరువదియవ యధ్యాయంబున నాధర్వణోత్తర తాపినియును బూర్ణముగా వివరింపబడి యవ్వాని తాత్పర్యము సుస్పష్టముగను విపులముగను, నిస్సంశయంబుగను నిరంకుశంబుగను సిద్ధాంతీకరింపబడినది.

( శ్రీ. క. భా. )


అనుభూతిస్వరూపాచార్యుడు - సారస్వత వ్యాకరణము రచించినయత డని వాడుక. ఇతనిని గూర్చిన యొక కథ గలదు. రాజసభ మధ్యమున నీత డొకనాడు అపశబ్ద ప్రయోగము చేయ దానికి నాధారము చూపు మన నింటికిబోయి సరస్వతి నారాధించెను. ఆమె ప్రసన్నురాలై యొక వ్యాకరణము నిచ్చెను.


ఈతడు సారస్వత వ్యాకరణము వ్రాయలే దనియు, దాని మీద ' ప్రక్రియ ' మాత్రము వ్రాసె ననియు, నీతడు క్రీ. శ. 1250 కి దరువాతను, 1450 కి బూర్వమునను ఉండె ననియు దజ్ జ్నుల యభిప్రాయము.

అనుమంచిపల్లి - కృష్ణజిల్లా, నందిగామ తాలూకా యందలి గ్రామము. జనసంఖ్య 815 (1931).