పుట:Andhravijnanasarvasvamupart2.pdf/70

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

శివలింగము:- అవ్యక్తము నుర్గుణము, నిరాకారము, నిరహంకారము, నిరవద్యము. అవ్యక్తమును అనంతములైన నామరూపభావములను విశ్వమంతయును సంభావించుచు ప్రవించుచు వ్యక్తము చేయుచున్నది. అవ్యక్తము లింగసుక్ష్మ స్థూలరూపములను విశ్వవ్యాప్తమై వెలయుచున్నది. ఆకాశలింగము, వాయులింగము, తేజోలింగము, అబ్లింగము, పృథ్వీలింగము, అవ్యక్తమునకు వ్యక్తస్వరూపములు. వ్యక్తమైన లింగస్వరూపములందు పార్థివలింగము, సగుణనిర్గుణరూపములను గలిగి పూజాపాత్ర మైనది. లింగము మహత్తునకు బీజచిహ్నము. శైవాగమములు షడక్షరీ మంత్రరూపపరముగ నిరూపించుచున్న లింగమాకాశాది పంచభూతములందును గోచరం బగుచున్నది.

లింగధారణము:- శివలింగమును వర్ణవివక్ష లేక సకల వర్ణముల వారును పూజించుచున్నారు. బ్రాహ్మణులు దేవతార్చనలందును, సకల వర్ణములవారును దేవాలయములందును శివలింగమును బూజించుచున్నారు. లింగధారులు లింగమును స్వీయాంగములందు ధరించుచు లింగధారి బ్రాహ్మణులు జంగములు వీరశైవులు మొదలగువా రగుచున్నారు. లింగధారణము బాహ్యార్థమును అంతరాథమును గలిగి వీరశైవమున కపూర్వమైన ప్రతిష్టను గలుగజేసినది.


వీరశైవము:- వీరశైవము కర్మపరమైన వైదికమతమును, జైన బౌద్ధమతములను ప్రతిఘటించుట కేర్పడిన వైదికమతము. వీరశైవమునకు ప్రధానదీక్ష లింగధారణము. లింగధారణమునకు గక్షము, కరము, ఫాలము, కంఠము, శిరస్సు, వక్షఃస్థలము ముఖ్యస్థానములు. లింగధారు లందరును జాతిమతకుల భేదములు లేని శివభక్తులు. బ్రాహ్మణులు, క్షత్త్రియులు, వైశ్యులు, శూద్రులు, పంచములు మొదలగౌ నని వర్ణములవారును వీరశైవులై కులభేదములను నిరసించిన విధమున వీరశైవమత చరిత్రమును, సిద్ధాంతములును విశదము చేయుచున్నది. కర్మమార్గమును నిరసించుచున్న విధమును వీరశైవ