పుట:Andhraveerulupar025958mbp.pdf/99

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

టికి గొనిరమ్ము, విశ్వాసపాత్రుడవు నీవు పోయినగాని వారురారు. తత్క్షణమ కొనిర'మ్మని చెప్పెను. కన్నమనాయడు ఆనవాలుగా బ్రహ్మనాయకుని ఖడ్గము దీసికొని మేడిపికిబోయి యటనున్న కాంతాసమూహమునకు సంగరక్రమము నంతయు నివేదించి బ్రహ్మనాయకుని యాజ్ఞదెలిపెను. రాజపత్నులు, కులకాంతలు, తమ బంధుబృందము మరణించి నందులకు జాలసేపు దు:ఖించి బ్రహ్మనాయని సన్నిధికి బ్రయాణమైరి. బ్రహ్మనాయడు గతించిన వీరుల యస్థికలు దీసికొని సమీపమునందున్న గుత్తికొండ బిలములోని ప్రవాహము నందు గలుపబోవుచు గులకాంతల నందఱను వెంటగొని యందుబ్రవేశించి యొక్కొక్కరి పేరుతో దిలోదకము లొసంగుచుండెను. బ్రహ్మనాయడు సకుటుంబముగా బిలములోనికి బోయి యున్నాడుగావున నీసమయము బిలద్వారము మూసితిమేని యాతడు మడియగలడని తలంచి నాయకురాలు కొందఱు భటులను ద్వారము మూయబంపెను. కన్నమనాయకుడా సంగతిగ్రహించి ద్వారము మూయుచున్న వంచకులనందఱను ఖండించి వారలను బ్రోత్సహించిన నాయకురాలినిబట్టి తెచ్చెను. బ్రహ్మనాయడు వీరులందఱకు ఉత్తరక్రియలాచరించినంతనె వీరకాంతలందఱు సహగమనము సలిపి పుణ్యలోకములు బడసిరి. నాయకురాలు బ్రహ్మనాయని పాదములకు నమస్కరించి యెఱుంగక కావించిన సాహసమునకు మన్నింపు