పుట:Andhraveerulupar025958mbp.pdf/100

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మని ప్రార్థించెను. దయాస్వభావుడగు బ్రహ్మనాయకుడు నాయకురాలికి బూజాకుసుమములు, తీర్థము నొసంగి యాదరించి బిలమునందలి ప్రవాహమునందు జొచ్చి యదృశ్యమయ్యెను. కన్నమనీడు బ్రహ్మనాయనికి భక్తివిశ్వాసములతో దర్పణాదు లొసంగి తానును బ్రవాహమున జొచ్చి యంతర్హితుండయ్యెను.

కన్నమనేడు ఆకాలమున మిగుల హీనముగా భావింపబడు పంచమకులమందు బుట్టినను బుద్ధివిశేషమునను ధర్మాచరణమునందును భూతదయయందును అగ్రవర్ణులకంటె యోగ్యుడని ప్రశంసింప దగినవాడు. ఈతడు పిత్రాజ్ఞానిర్వహణమునందు శ్రీరామచంద్రునకు, సోదరవాత్సల్యమునందు ధర్మరాజునకు, బరాక్రమమునందు గర్ణునకు సమానుడు. దీనత్రాణ పరాయణుడును సర్వభూత ప్రియుడునగు బ్రహ్మనాయని క్రమశిక్షవలననే కన్నమనాయడు విఖ్యాతినందెను. అగ్రవర్ణులమని చెప్పుకొను వీరపురుషులు సంస్కర్తలై బ్రహ్మనాయనివలె బంచముల బ్రేమించి యుచితవిద్యా వివేకమునుప్రసాదించి ముందునకు గొనితెచ్చినచో నాడుమొదలు నేటివరకు నెందరు కన్నమనాయనివంటి వీరచూడామణులు, దేశభక్తు లుదయించువారోగదా! పలనాటి యుద్ధములో గతించిన వీరులతోబాటు కన్ననాయనికి గూడ వీరపూజ నాటినుండి నేటివరకు జరుగుచున్నది. కన్నమనాయని నేటికిని