పక్షము విస్తారముగ నుంటచే బ్రహ్మనాయడు కన్నమనాయకుని బ్రోత్సహించి విజయము గలుగువఱకు సంగరము గావింపుమని వీర తాంబూలము నొసంగెను. కన్నమనాయడు భైరవఖడ్గముబట్టుకొని యుద్థరంగమున కుఱికి శత్రువుల నందఱను అరటిచెట్టులను నఱకినటుల నఱుకుచుండెను. వీరు లెవరును కన్నమనాయని నెదిరింపజాలరైరి. రణరంగము క్షణముసేపులో రక్తప్రవాహములతో నిండిపోయెను. ఎక్కడజూచిన తానయై కన్నమనాయడు బ్రహ్మనాయకుని యాన శిరసావహించి శత్రుబలమునంతయు నిరపశేషముగావించెను. ఉభయపక్షములందును బేరుగల వీరులందఱు మరణించిరి. ఏకపుత్రుడగు బాలచంద్రుడు గూడ మరణించెనని బ్రహ్మనాయకు డించుక విచారపడి మఱల ధైర్యము కొని కర్తవ్యము యోచించుసరికి కన్నమనాయడువచ్చి నాయకురాలు దక్కమిగిలిన శత్రుబలమంతయు నాశనమయ్యెనని విన్నవించెను. బ్రహ్మనాయుడు కన్నమనాయని గౌగిలించికొని 'కుమారా! నాఋణముతీర్చికొంటివి. నీకదనప్రశస్తి లోకమునంతయునచ్చెరువు పెట్టినది. మనము ప్రపంచములోనికివచ్చి పుణ్యమో పాపమో గడించితిమి. ఆప్తులందఱు మరణించిరి. నాయకురాలొకతె జీవించి యేమి ప్రతిఘటింప గలదు? కావున మనమిక నూర్ధ్వలోకముచేర నదను సమీపించినది. సంగరమునకు ముందు మన కులకాంతల నందఱను మేడపిలో నుంచివచ్చితిమి. వారలనందఱను ఇచ్చ
పుట:Andhraveerulupar025958mbp.pdf/98
Jump to navigation
Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
