పుట:Andhraveerulupar025958mbp.pdf/71

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

    ప్పనివాడును సత్యము జె
    ప్పనివాడును ఘోరనరక పంకమునబడున్.

అను నీతివచనమును దలంచుకొని సత్యము చెప్పక దాచగూడదని రాజన్యునితో "ఆర్యా! ఈ కొమారునివలన మీకు మరణము గలుగును. కొమారుడు చిరాయుశ్శోభితుడనుట కెట్టిసందియము లేదు" అని విన్నవించిరి. రాజు బ్రాహ్మణుల సగౌరవముగ బంపివైచి ప్రోలరాజు తనధర్మపత్ని కీరహస్య మేకాంతమున నెఱింగించెను. ఆయమయు నొకవైపు పుత్రప్రేమము మఱియొకవైపు భర్తృభక్తి హృదయము నుర్రూతలూప జాలసేపు నిశ్చేష్టురాలై కర్తవ్యభారము భర్తపైనుంచెను. ప్రోలరాజు కానకగలిగిన నెత్తురు కందును విడువజాలక ఆత్మమరణమున కియ్యకొనజాలక పత్నియనుమతిచొప్పున నాబాలకుని నర్థరాత్రమున రహస్యముగ గొనిపోయి స్వయంభూస్వామి మండపమున బొత్తులుపఱచి యందు బరుండబెట్టి పుత్రమోహవిషణ్ణయగు పత్నిచే బిడ్డనికి బాలిప్పించి పుత్రబంధము ద్రెంపుకొనజాలక యెటులో బయట బడెను.

మఱుసటిదినమున ఆలయ పరిచారకులు చూచుసరికి గేవు కేవుమని యేడ్చు నీనెత్తురుకందువు కాన్పించెను. వారలు వెంటనే యీరహస్యము నంతయు నర్చకులకు నివేదించిరి. వా రాశిశువును గాంచి దివ్యాకారశోభితుడగు నీబాలకుడు