పుట:Andhraveerulupar025958mbp.pdf/70

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చక్రమునుబట్టి కోటకు రేఖలువ్రాసి యగడ్తలు త్రవ్వించి అనుమకొండవైపొక ద్వారమేర్పరచి చెంత నొకదివ్యాలయమున నాగలింగమును బ్రతిషచేయించెను. నూతనముగ నిర్మించిన పురమునకు నేకశిలానగరమని పేరు బెట్టి శ్రీపాదులు నిజనివాసమున కరిగిరి. స్పర్శవేదలింగమునకు సోకించినమాత్రమున దినమునకొక పుట్టియినుము అంతియ బంగారుమగుచుండెను. రాజన్యుడు దానిని ధర్మార్థము వినియోగము చేయుచుండెను.

చిరకాలమునకు బ్రోలరాజున కొకపుత్రుడుజనించెను. విధివిహితంబుగా నా బాలునకు నామకరణాది శుభకార్యంబులు నెరవేర్చి మహోత్సవాగతులకు విద్వాంసులముందు రాజన్యుడు కుమారుని జన్మకాలనక్షత్రాదికముల విన్నవించి బాలకుని భవిష్యజ్జీవితము నిర్ణయింప బ్రార్థించెను. బ్రాహ్మణోత్తములు తమలో దాము సంశయించుచు రాజుతో మాఱాడ వెఱచిరి. చకితుడై రాజన్యుడు విద్వాంసుల సందర్శించి యంజలి మోడ్చి "కానక గన్న యీకందువునకు బాలారిష్టములు లేవుగదా! ఈశ్వరవరప్రసాదమున సంతానవృక్షమునుండి లభించిన యీ ఫలము మాచేతినుండి తొలంగిపోవ భగవత్సంకల్పముకాదుగదా! ఆజ్ఞయిం"డని సదైన్యముగ బ్రశ్నించెను. విద్వాంసులు దూరమాలోచించి,

కం|| తనయెఱిగిన యర్థంబొరు
     డనఘా! యిది యెట్లు సెప్పుమని యడిగిన