పుట:Andhraveerulupar025958mbp.pdf/72

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

చక్రవర్తులయింట జనింపదగినవాడు. ఇట్టి దుర్గతికి లోనుగావలసినయవస్థ యేమికలిగెనో యని వానిని గొనిపోయి యింట నుంఛి యారహస్యమును బ్రోలరాజులకు నివేదించిరి. రాజా బాలుడు తనకుమారుడె యని యెఱింగియు నెఱుంగని యటుల నటించి ప్రేమము జంపుకొని యర్చకునితో ఎవడైన నేమి! పసిబిడ్డడు. రక్షింపదగినవాడు యుక్తవయస్సు వచ్చు వఱకు గాపాడి విద్యాబుద్ధులునేర్పి వానిని సంస్థానమున కప్పగింతురేని స్వతంత్రముగ జీవింపగలవాడగును. వీనిచే మీకు బుణ్యము పురుషార్థము కలుగును. బాలకుని పోషణమునకగు వ్యయమును సంస్థానమే భరింపగల"దని చెప్పి బాలకుని సంరక్షణమునకై కొందరు విశ్వాసయోగ్యులగు భటుల నియోగించెను. అర్చకులలో బెద్దయగు రుద్రజియ్యయనునాత డా బాలుని పోషణభారము దన తలపై నుంచుకొని యుక్తవయస్సు వచ్చినపిదప విధ్యుక్తముగ నుపనయనము గావించి బ్రాహ్మణ ధర్మానుసారముగ వేదశాస్త్రాదికము, క్షత్రియ ధర్మానుగుణముగ ధనుర్విద్యాదికము నేర్పి జాగరూకత నాబాలుని గాపాడసాగెను. అర్చకు డా బాలునకు రుద్రదేవుడని నామకరణము గావించెను. ఈతడె మన కథానాయకుడు. పవిత్రవంశమున జనించినవాయను ఆంధ్రవాజ్మయమునకు ఆంధ్రదేశమునకు బ్రత్యేకవ్యక్తిత్వము సమకూర్పదగిన మహానుభావుడగుటచే గాబోలు నీబాలకుడు స్వల్పపరిశ్రమచేతనే సర్వశాస్త్రపరిజ్ఞా