పుట:Andhraveerulupar025958mbp.pdf/67

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దేశము భిన్న భిన్నముగ నుండెను. ఆంధ్రదేశమునకు బ్రత్యేకరాజ్యము లేకున్న లాభము లేదని ప్రోల భూపాలుడు అనుమకొండలో నాంధ్రసామ్రాజ్యమును స్థాపించినది మొదలు తక్కు దుర్గాధీశ్వరులకు బ్రోలరాజునకు వైరము పెచ్చరిల్లసాగెను. ప్రోలరాజు తనయావజ్జీవితము సంగ్రామరంగముననె గడపెను. దేశమంతయు నొక్కటి, యాతడొక్కడు నొకటి యగుటచే నెడతెగక బలమువృద్ధిజేసి ప్రతిఘటించిన రాజన్యుల నందఱను సామంతులుగ జేసికొనువఱకు జాలకాలము పట్టెను. మనము పఠింపబోవునది రుద్రదేవుని చరిత్రమైనను అతని పవిత్రజీవితమున కాధారభూతుడగు ప్రోలరాజు జీవితముగూడ బఠించుట యావశ్యకము కాకపోదు.

ప్రోలరాజు ఆంధ్రదేశ రత్నమనదగు అనుమకొండలో నాంధ్రసామ్రాజ్య రాజధానిని నెలకొల్పి చిరకాలమునకు దేశమున శాంతి స్థాపించెను. మరల జాళుక్యరాజులలో నొకడు కొంతబలమును సంపాదించికొని ప్రోలరాజును లోబరచికొనినగాని తనపూర్వ రాజ్యమంతయు హస్తగతము గాదని తలంచి విశ్వనాధ దేవుడను వీరవర్యుని సేనానాయకుని గావించి యుచిత పరివారముతో గుదురుకొన నున్న యాంధ్రసామ్రాజ్యము కూలద్రోయింప బంపెను. ప్రోలరాజు మొక్కవోని పరాక్రమముతో సేనానాయకుని సైన్యమును జెండాడి మూలచ్ఛేదనము గావింపకున్నచో శత్రువృక్షము మఱల జిగి