పుట:Andhraveerulupar025958mbp.pdf/68

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రించునని కళ్యాణపురమును ముట్టడించి రాజవంశమును జెండివైచి విరోధియనువానిని లేకుండ జేసి, ఖడ్గముదాల్చి తానొనర్చిన తానొనర్చిన కూరకృత్యములు, హత్యలు స్మరించి పాపపరిహారార్థమై గంగాతీరమున దేవళములు, కోనేరులుగట్టించి జీవితశేషము పారమార్థిక చింతనముతో గడప నిశ్చయించెను.

ప్రోలరాజు అనుమకొండరాజ్యము పాలించుతఱి నొక చిత్రకథ జరిగెను. దూరవాసులగు పౌరులు కొందఱు రాజధానికి బండ్లతో వచ్చుచుండ అనుమకొండ రెండుక్రోసుల దూరములో నుండ నొకబండికాలు నేలలో దిగబడెను. మిగిలిన బండివాండ్రదఱు నాశకటచక్రమును బైకిలాగ నెంచి కృతార్థులు కారైరి. ఆ శకటములకు సంబంధించిన జనులందఱు గ్రామములోనికేగి అనుమకొండ వాసుల కీయవస్థతెలిపి జన సమూహమును సహాయముగొని బండ్లాగిన చోటు జేరి నేలలో నిరికికొనిన శకటచక్రము బలమంతయు నుపయోగించి లాగసాగిరి. కొంతసేపటికి భూగర్భమునుండి శకటచక్రము బయట పడెను. దానికమ్మి యంతయు సువర్ణమయ మయ్యెను. కాలు దిగబడినచోట సువర్ణచ్ఛాయ వెల్లివిరియు చుండెను.

పౌరు లావింత వేగమునబోయి ప్రోలరాజున కెఱిగించిరి. అతడు పరివారముతో బయలు వెడలి యాప్రదేశము సందర్శింప నటనొక సువర్ణలింగము జ్యోతిర్మయమైనది కానవచ్చెను. రాజన్యుడు వెంటనే దానిని ద్రవ్వించి యాశకటముపై