పుట:Andhraveerulupar025958mbp.pdf/66

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సైనికులనందఱ సమావేశపరచి రొక్కమునంతయు వ్యయము గావించి ప్రజాద్రోహము గావించుచు జనకంటకులై వర్తించున్న పూర్వసామంత రాజులనందఱ బంధించి సన్మార్గావలంబనులగు నూతనులను సామంతులుగను రాజ ప్రతినిధులుగను నియోగించి అనుమకొండలో నాంధ్రసామ్రాజ్యమును స్థాపించెను. దేశమంతయు నశాంతిమంతమై యున్న సమయములో జాతీయతా వర్థనమునకై యాంధ్ర సామ్రాజ్యము నెలకొల్పి, యాఱిపోయిన చాళుక్యపరాక్రమవహ్నిని రగులజేసి మాతృ సేవగావించిన ప్రోలరాజన్యుని జీవితము మన కసమగ్రముగ లభించియున్నది. ప్రోలరాజు నెలకొల్పిన సామ్రాజ్యము నేటికి విస్మృతికి వచ్చినను నాటి శుభచిహ్నము లింతవఱకు అనుమకొండ ప్రాంతమున గానవచ్చుచున్నవి. జీర్ణచిహ్నములతో నాటిదుర్గములు, దేవళములు, ధర్మశాసనములు, రాచబాటలు, సరోవరములు, సింహద్వారములు గానవచ్చుచు నేటికి గూడ బ్రాచీనాంధ్ర దేశ చరిత్రకారులకు జరిత్ర భిక్ష పెట్టుచున్నది.

ప్రోలరాజు కాలమున వర్థమాన పురము, పొలవాస, ధర్మపురి, మంత్రకూటము, దేవగిరి, కళ్యాణ పురములోనగు చోటుల బలవంతులగు చాళుక్య రాజ ప్రతినిధులూ రాజ్యము చేయుచుండిరి. ఎవరికి వారు స్వతంత్రులై సంఘైకమత్యమున గల మేలులు మఱచి వర్తింప దొడంగిరి. ఆంధ్ర