పుట:Andhraveerulupar025958mbp.pdf/44

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

డుచు "గుమారా! నన్ను వీరమాతయని యనిపించుట ధర్మము. మీజనకుని చెట్టబట్టి సమస్తభోగముల ననుభవించి వీరపత్నీ ననిపించుకొంటిని. నీవలన వీరమాత నైతిని గృతార్థుల నయ్యెద" నని పల్కెను. మాధవవర్మకు దల్లియగు సిరియాలదేవి తెలుపు మాటలలోని భావము భోధకాదయ్యెను. తన ధర్మమును గూర్చి లోలోన బలుమాఱు యోజించి నిశ్చితాంశము నెఱుంగనేరక మాధవవర్మ స్పష్టముగ నీ యభిప్రాయము నెఱింగింతువేని యవశ్య మొనరింతునని ప్రతిజ్ఞ చేసెను.

సిరియాలదేవి కుమారుని ప్రతిజ్ఞ యాలించి యానంద పరవశమై యిటుల జెప్పెను. "పుత్ర రత్నమా! సర్వభోగ్య సంభరితమగు మనకందారరాజ్యము పరాధీన మగుటచే నిన్ని యిక్కట్టుల పాలైతిమి. ఇపుడు నీకతన పూర్వరాజ్యమును బడయగలుగుదునేని నేను వీరమాతలలో నగ్రగణ్య నగుదును. మనకందార రాజ్యమునకు బల్లహుడు పాలకుడై వర్తించుచున్నాడు. వానిచే నేను మిగుల బరాభవింప బడితిని. అక్రమముగ నాతడు కచ్చకు గాలుద్రవ్వి యన్యాయముగ బశుసమూహమును దొంగిలించుకొని పోవుటయేగాక విభవాస్పదంబైన కందార రాజ్యంబునంతయి విధ్వంసంబు గావించినాడు. ముం దుద్భవింపనున్న నాతనయునివలన నెట్టి యిడుమపాటు నొందవలసి వచ్చునోయని యా దురాత్ముడు