పుట:Andhraveerulupar025958mbp.pdf/43

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

ర్తమున మీ యిచ్చచొప్పున రాజ్య పరిగ్రహణము గావింతునని ప్రత్యుత్తరము నొసంగెను.

వందిమాగధులు స్తవముగావించుచుండ మంగళవాద్యముల ధ్వనులు భూనభోంతరములు నిండి మారుమ్రోయుచుండ భూసురాశీర్వాద పురస్సరముగ మాధవశర్మ నిర్ణయించిన శుభలగ్నమున మాధవవర్మ అనుమకొండ సామ్రాజ్యమునకు బట్టాభిషిక్తు డయ్యెను. ఎఱుకుదేవరాజు మాధవర్మకు సమస్తైశ్వర్యములు వశముగావించి దక్షిణకాశియనందగు నమరావతీ పుణ్యక్షేత్రమునకు దవము గావించుటకై వెడిలిపోయెను. పద్మాక్షీదేవి యొసంగిన సమస్త బలంబులు నెఱుకుదేవరాజొసంగిన బలంబులు కలిపి, రాజ్యము మిగుల నభివృద్ధిలోనికిం దెచ్చి మాధవవర్మ మిగుల జాగరూకతతో బరిపాలించుచు గృతజ్ఞతాసూచకముగ మాధవశర్మకు నాతనిదర్మపత్నికి ధన కనకవస్తువాహనంబులు చీనిచీనాంబరముల నొసంగి యిచ్చవచ్చిన గ్రామముల నగ్రహారముల నొసంగి యుత్తమోత్తములగు మంత్రుల యనుమతి ననుసరించి వర్తించు చుండెను.

రాజ్యవిభవముతో దృప్తినొంది సమస్తైశ్వర్యముల ననుభవించుచు అనుమకొండసామ్రాజ్యమును శత్రుజన భీకరముగ బరిపాలించుచున్న తన పుత్రరత్నమగు మాధవవర్మను వీక్షించి సిరియాలదేవి సానురాగముగ మాటల