పుట:Andhraveerulupar025958mbp.pdf/45

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అనుమకొండ కేతెంచి నాకొఱకై వెదకించి బంధింప బ్రయత్నించెను. పుణ్యశీలురగు నీవీటి బ్రాహ్మణులును దయామయుండగు మాధవశర్మ నన్ను బ్రతికించి నిన్నీ యాంధ్రదేశమున కొసంగి పరమోపకారంబు గావించిరి. కాన నీయందు రెండుధర్మము లిమిడియున్నవి. ధర్మ నిర్వహణానంతరము గాని నీవు ఋణ విముక్తుడవు కాజాలవు. పరమోపకారము గావించి చంద్రవంశమును శాశ్వతముగ నిల్చునటుల ననుగ్రహించిన యీ బ్రాహ్మణోత్తము లందఱుకు వృత్తిస్వాస్థ్యముల నొసంగి కృతజ్ఞత వెల్లడించుట ప్రధాన కర్తవ్యము. బల్లహుని ఖండించి తద్రక్తముతో బితృతర్పణము గావించి పూర్వాపహృతములగు పశువుల నన్నింటిని గొని తెచ్చి నాకు వీరమాతృనామము నొసంగుట నీ రెండవ ధర్మము. నీపవిత్రమగు జన్మము వలన నాజీవితము తరించినది. మీ జనకుడు బల్లహునిచే వధింపబడినటుల జనశ్రుతి కలదు. అదియ నిశ్చయమేని పరముననున్న యాతనియాత్మ కృతార్థత నొందగలదు, లేదా సజీవిగ నుండెనేని పుత్రసందర్శనముచే గృతార్థుడు కాగలడు" ఇట్లు కుమారునకు దెల్పి యంత:పురమునకు వెడలిపోయెను.

మాతృసందేశము, తన పూర్వచరిత్రము వినినదాది యుత్సాహ మతిశయించి ప్రత్యర్థిమారణమునకు మాధవవర్మ ప్రయాణము కా నిశ్చయించెను. భటులందఱు సంగ్రా