పుట:Andhraveerulupar025958mbp.pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మస్తని యా పదార్థమును స్వీకరించి సిరియాల దేవితో నిజ గృహములకు వెడలిపోయిరి.

బల్లహునిహృదయశల్య మటులనె యుండెను. సిరియాలదేవి గర్భస్థశిశువు తనమారకు డని యాత డాగతానాగతవేదుల వలన వినియుండెను. అందుచే బల్లహునకు సిరియాలదేవిని గుర్తించి బంధింపలేక పోతినేయను విచారము మెండయ్యెను. రాజభటులు సిరియాలదేవి యీమెయే యని చెప్పుచున్నను బ్రాహ్మణ శాపమునకు భయపడి బల్లహుడు చేత జిక్కిన యువతిని బుద్ధిపూర్వకముగ వదలిపెట్టెను. ఆయమ సిరియాలదేవి యని నిర్ణయించుటకు జాలి నన్ని యాధారము లాతనికి లభింప వయ్యెను. మాధవశర్మ తన కూతురనియు బ్రసూతికి వచ్చెననియు ఱాయిగ్రుద్ది వాదించు చుండ నాయమయే సిరియాలదేవి యని బల్లహుడెటుల సాహసించి వాకొనగలడు! సిరియాల దేవి బహుశ: సహగమనము గావించియుండు నేమో యనుకొని వెదకి వెదకి వేసారి కొలది కాలమునకు బల్లహుడు కటకము చేరెను.

పులినోటనుండి లేడికూన బయట బడినటుల దైవవశమున బల్లహునిబారినుండి సిరియాలదేవి బయటబడిన వెంటనే మాధవశర్మ యామెను మిగుల సంతోషముతో దవ యింటికి గొనిపోయి యధావిధి సుత నిర్విశేషముగ దిలకించుచుండెను. సాటి బ్రాహ్మణులందఱు హర్షించి సహస్ర