పుట:Andhraveerulupar025958mbp.pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సిరియాల దేవి ప్రతిచ్ఛందము బల్లహుడు తనభటుల కొసంగి 'యిట్టి యాకారవిశేషములు గల యువతీమణి యీపురమున నున్నది. రాజమందిరములు, రచ్చకూటములు, బ్రాహ్మణ గృహములు, పఠనమందిరములు పరిశీలించి యెటనేని యున్నచో బట్టితెచ్చిన యెడల గొప్ప పారితోషికము నొసంగుదు'నని బల్లహు డాజ్ఞాపించెను.

ఎఱుకరా జాత్మ సంరక్షణము నాశించి యంతకు మున్నె చనువు నొసంగిన వాడగుటచే బ్రతిబింబపటము గొని బల్లహుని భటులు స్వేచ్ఛగ సిరియాలదేవి కొఱకు వీధులన్నింటిని గాలించిరి. ఎట గూడ వారు తలంచిన కాంతామణి కానరాదయ్యెను. తుదకు భటులు మాధవశర్మ గృహమున బ్రవేశించి యనుమానాస్పదముగ నున్నదని సిరియాలదేవిని బంధించి బల్లహుని యొద్దకు గొనిపోయిరి. భయకంపితురాలై సిరియాలదేవి గడగడ వడకుచు విలపించు చుండెను. బ్రాహ్మణవాటిక లోని పిన్న పెద్దలందఱు నటజేరి యాతరుణ విలాసమును జూచి నిలువున నీరైరి. రాజభటులు నిర్దయులై యామెను రచ్చకీడ్చి లాగికొని పోవుచుండిరి. ఇంతలో ననుష్ఠానవేదిక నుండి లేచి విష్ణుశర్మ ముందునకు వచ్చి రాజభటుల జూచి "అక్కటక్కటా! యెందేని యీయన్యాయము కలదా! ఈయమ నాపుత్రి. గర్భవతియగుటచే మొన్ననే కొనివచ్చితిమి. బలవంతముగ లాగుకొని పోవుచుంటిరా? మీకు