పుట:Andhraveerulupar025958mbp.pdf/187

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తొలగింప వలయుననియు వార్త బంపగా నందుల కంగీకరించెను. సీతారామరాజునకు విజయరామరాజుగారిచే నుపకార వేతన మిచ్చునట్లు దొరతనమువారు కట్టుబాటు చేసిరి. ఆకట్టుబాటు ప్రకారము సీతారామరాజునకు నెల యొకటికీ ఐదువేల రూపాయల నొసంగుచు మదరాసును విడిచి బయటికి బోవరాదని దొరతనమువా రాజ్ఞాపించిరి. ఇవియన్నియు జరిగిన పిదప విజయరామరాజు తాను స్వతంత్రముగా రాజ్యమును బాలించుకొనుచుండెను. పరిపాలనాకౌశల్యము గలవాడు గావున నమ్మకమగు నౌకరులను బెట్టి రాజ్యమున మంచి కట్టుబాటును జేసెను. దొరతనమువారు ఇతర రాజ్యములతో బాటు తనరాజ్యము గూడ హరించుటకె యెన్నో యత్నములు చేయుచున్నారనియు గనుగలిగి మెలగ కున్నచో విప్లవము తప్పదని తన విధులు సక్రమముగా నెరవేర్చు చుండెను. రాజ్యమునందు బంటలు మందగించుటచే సిస్తులు సకాలమున వసూలు కాకపోయెను. ఆకారణమున విజయరామరాజుచేయునది లేక దొరతనము వారికి నీయవలసియున్న పేష్కషు గూడ బకాయి పెట్టెను. కడకు విజయరామరాజు దొరతనము వారికి ఆఱులక్షల యిరువదియైదువేల రూపాయలు బాకిపడెను. అందుచే గంపెనీవారు విజయనగర రాజ్యమును దాము గైకొని ముప్పదివే లొక్కమాఱుగ నిచ్చునట్లును నెలనెలకు బండ్రెండు వందల రూపాయలు వ్యవయములకు ఇచ్చెద మని