పుట:Andhraveerulupar025958mbp.pdf/188

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

యును విజయరామరాజును బందరులో నుండవలసినదనియు నిర్బంధించిరి. కంపెనీవారు విజయనగరరాజ్యమును ఇతరులకు గౌలునకీయ యత్నించిరి. ఎవరునురాకపోయిరి. ఎటులేని భేదనీతితో విజయనగర రాజ్యము పరాధీనము గావింప నెన్నివిధముల యత్నించినను లాభము లేక పోయెను. విజయరామరాజు రాజ్యమునుంచి బందరుపోవుట కెంతమాత్ర మిష్టములేక పోయెను. ఆంగ్లేయుల యొత్తిడికి సహింపజాలక కడకు విజయరామరాజు బందరునకు బ్రయాణమయ్యెను. రాజ్యమును విడచి బందరులో బరాధీనముగా బడియుండ నాతనిమనస్సు ఒప్పుకొనకపోయెను. వెంటనే వెనుకకుమరలి తనరాజ్యమునందున్న సుప్రసిద్ధక్షేత్రరాజమగు పద్మనాభము జేరెను. అది యాంగ్లేయులు గ్రహించి విజయరామరాజును బందరునకు బొమ్మని మిగుల నొత్తిడిచేయుచుండిరి. ఆయన సమయమునకేదో ప్రత్యుత్తరము వ్రాయుచు బందరునకు బోడాయెను. కంపెనీవారి కిదియంతయు నవమానకరముగా నుంటచే విజయరామరాజునకు ఇరువదినాలుగు గంటలలో బద్మనాభమును విడిచి బందరునకు బోవలసినదనియు అట్లు పోవనియెడల సైనికసహాయమున మేము పంపకమానమనియు వర్తమానమంపిరి. స్వతంత్రశీలుడు పరాక్రమశాలియునగు విజయరామరాజున కీసందేశము మిగుల నవమానకరముగ దోచి రాజ్యమునుండి తన్నంపుటకు కంపెనీవా