పుట:Andhraveerulupar025958mbp.pdf/186

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చున్నారలు. రైతుల విషయములో నేమాత్రము శ్రద్ధగైకొనుట లేదు. ప్రజలు క్షామపీడితులై తినుట కన్నము లేక మలమల మాడుచున్నారు. నీటివసతు లేమాత్రము తృప్తికరముగా లేవు. సైన్యముకొఱకు బ్రతిసంవత్సరము ఐదు లక్షల రూపాయలు వ్యయముచేయుచుంటచే బొక్కసమందలి ధనమంతయు వ్యయమగుచున్నది. ఈవిషయములో ఆంగ్ల దొరతనమువారు శ్రద్ధపుచ్చుకొని విజయనగర సంస్థానమును కట్టుబాటులలో నుంచుట చాల నవసరము." ఈ నివేదిక దొరతనమువారి సంకల్పమునకు దోడయ్యెను. పాలకొండ, జయపురము, గోలుకొండ, టెక్కలి, కిమిడిలోనగు సంస్థానముల ప్రభువులను సైన్య సహాయము చేయుమని యొత్తిడి చేయుటయు, గొందఱు జమీందారులకు ఖ్యాతి యొసంగి గ్రామముల గైకొనుటయు, సాలూరు, పాచిపెంట, విషమకోట, కాశీపురము, బొబ్బిలి లోనగు సంస్థానము లేలు ప్రభువులను జెరసాలలోబెట్టి సాధించుచుంటయు దొరతనమువారికి దుస్సహముగా నుండెను. బొబ్బిలి పరిపాలకుడగు వెంగళరంగారావు జయిలునుండి మాయోపాయములతో దప్పించుకొని హైదరాబాదునకు బాఱిపోయి తమ కష్టములు, కంపెనీవారి యుపేక్షయు దెలిపి నవాబును సహాయముకమ్మని కోరినట్లు, ఈయంశములు గూడ ఉపసంఘమువారు తెలిపిరి.

కంపెనీవారు విజయరామరాజునకు సైనికబలము కావలయుననియు సీతారామరాజును మంత్రిపదవి నుండి