పుట:Andhraveerulupar025958mbp.pdf/171

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ముందుకాళ్లు ఏనుగుమీదనుంచి నిలువబడెను. సోమనాద్రి తన కరవాలముతో సయ్యదుమియ్యాను జంపబోయెను. ప్రాణభయముతో సయ్యదు మియ్యా సలాములు చేయుచు, నీకు గప్పము గట్టుదును, రాజ్యములో గోరినంత భాగము నొసంగెదను రక్షింపు'మని ప్రార్థించెను. ఉదారశీలుడగు సోమనాద్రి కరుణించి యెత్తినకత్తి వ్రాల్చి మహమ్మదీయునితో "నీవు నన్ను గోటగట్టుకొన నిచ్చితివిగాన నీరాజ్యము నీకువదలుచున్నాను. నీకు నేనుగాని నాకు నీవుగాని సామంతులము గావలసిన పనిలేదు. నీవోడిపోయినటుల గుర్తుగా నుండుటకు యుద్ధమునకు గొనివచ్చిన నగారా, పచ్చజండా, ఏనుగును మాత్రము నాకిచ్చి పోవలయి"నన నవాబు సోమనాద్రి కవియెల్లయొసగి బ్రతుకుము జీవుడాయని తన కోటలోనికి బోయెను. సోమనాద్రి జయలక్ష్మితోబాటు సైదుమియ్యాయిచ్చిన విజయచిహ్నములు, బసరుజంగు విడిచి పోయిన ఫిరంగులు, హతులైన వీరభటుల ఆయుధములు దీసికొని గద్వాల జేరి నగరమధ్యంబునందు జయస్తంభము ప్రాతి నవాబునొద్ద గైకొన్న పచ్చజండా దానిపై గట్టించెను.

సయ్యదుమియ్యా తనరాజ్యము చేరినదాదిగా బరాభవ దు:ఖము కలచివేయుటచే గొన్ని దినములు బయటికె రాడయ్యెను. ఒకనాడు కోటబురుజుపై నెక్కగా గద్వాలలో జయస్తంభముపైన దన పచ్చజెండా కనపడెను. పరాభవ