పుట:Andhraveerulupar025958mbp.pdf/170

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సోమనాద్రి తన సహాధ్యాయులను సహాయముకోరి పిలువనంపగా వారు పరివారముతో ఆయుధపరికరములతో సంగరమునకు సహాయమువచ్చిరి. ఉభయదళములకు భయంకర సంగ్రామము జరిగెను. సమీపమునందున్న ఆంధ్రులందఱు స్వాతంత్ర్య సంగరమున సోమనాద్రికి సహాయపడిరి. మహారాష్ట్రులు, కర్ణాటులుగూడ సోమనాద్రి కనేకగతుల ధనమును, సైన్యమును సహాయముచేసిరి. మొక్కవోని బీరమున సోమనాద్రిబలము చిరకాలము పోరాడెను.

బసరుజంగు ఆంధ్రవీరులధాటి కాగజాలక గుఱ్ఱము నెక్కి పాఱిపోవసాగెను. వీరవతంసుడగు సోమనాద్రి యాతనిని వెంబడించి తరుముచు బోవ బ్రాణభీతితో నతడు రాయచూరు కోటలో దూరి ద్వారములు బిగించికొనెను. సోమనాద్రి కోటలోనికిబోవ యత్నించుచుండ గోటముందున్న యేనుగుప్రతిమలను జూచి గుఱ్ఱము బెదరెను. వెంటనే యా విగ్రహముల తుండములు దంతములు ఖండించి వెనుకకు మరలి సోమనాద్రి సంగరరంగ మలంకరించుసరికి ప్రాగుటూరి నవాబు గూడ పాఱిపోయెను. స్వల్పసైన్యముతో సయ్యదుమియ్యాయొక్కడు మాత్రము సంగరరంగమున మిగిలెను. ఆతడు హతశేషసైన్యమును ముందిడుకొని సోమనాద్రిపైకి మొండిచొరవతో రాదొడంగెను. సోమనాద్రి సైన్యమును భేధించి మియాను సమీపింపగ సమరాశ్వము తన