పుట:Andhraveerulupar025958mbp.pdf/172

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దు:ఖ మతిశయించెను. ప్రతిక్రియ గావించి యెటులేని సోమనాద్రిని బేరులేకుండ నెగురగొట్ట దలంచి హైదరాబాదునకు బ్రయాణమై నాలుగు మూడు దినములకుజేరి యా రాష్ట్రమును బాలించు నిజాము అలీకి దనరాక దెలియజేసెను. నిజాము ఆలి, యాతనిరాక విని తన గురుపరంపరకు జెందిన సయ్యదుమియ్యా సామాన్యునివలె వచ్చుటకు గారణమేమని యోచించి వెంటనే రమ్మని యాజ్ఞ యొసంగెను. మియ్యా నిజాము ఆలీని చూడగానే వంగివంగి సలాములుచేసి ఒంటికాలిమీద నిలుచుండి తన దురవస్థయు దన్ను సోమనాద్రి పరాభవించి వీరచిహ్నములు గొనిపోయిన విధము తెలిపి యెటులేని సోమనాద్రిని బంధించి తాను గోలుపోయిన జెండా, నగారా, ఏనుగు ఇప్పింపుమని ప్రార్థించెను. నిజాము ఆలీ సోమనాద్రి బలపరాక్రమములు నాలించినవాడగుటచే "నిది సంగరమున కదనుగాదు. సోమనాద్రి అప్రమత్తుడై మైమఱచి యున్నపుడు సంగర మొనరించినచో జయము సులభసాధ్యము. అంరవఱకు నిరీక్షింప^' మని చెప్పెను. "ముందు సోమనాద్రిని బంధించి నా విజయచిహ్నముల నాకిప్పింతురా బ్రతుకుదును. లేదా, నేను జీవింప"నని వాడికత్తితో గంఠము వఱకుకొనబోవుచుండ నిజాముఆలి సయ్యదుమియ్యా నెటులో సమాధానపఱచి పదునేనుదినములలో సంగరమునకు దప్పక వచ్చెదనని వాగ్దానముచేసి పంపెను.