పుట:Andhraveerulupar025958mbp.pdf/158

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కోటుల వరహాలుగూడ నాశమయ్యెను. సర్వవిధముల మహోన్నతదశయందుండి ప్రకృతిసహజమగు శైలదుర్గములచేతను దుంగభద్రావాహినిచేతను సురక్షితముగానున్న విద్యానగర సామ్రాజ్యమును జేసేతుల విరూపాక్షరాయలు పాడుసేయుటజూచి సామంతులు సేనానులుగూడ దిరస్కారభావముతో నుండిరి. ఇంక నుపేక్షించినయెడల బరిస్థితులు విషమించునని రాజశేఖరురాయలు తన తండ్రియగు విరూపాక్షరాయలను జంపించెను. ఇతనిసోదరుడగు రెండవ విరూపాక్షరాయలు రాజశేఖరు రాయలను జంపించెను. భ్రాతృహంతయగు రెండవవిరూపాక్షరాయలయెడ బ్రజలహృదయములం దసంతృప్తిజనించెను. రాజ్యమునం దంతటను దిరుగుబాటు లభివృద్ధియయ్యెను. ఎవనికి వాడె స్వాతంత్ర్యమును బ్రకటింప యత్నించుచుండెను. ఉదయగిరిరాజ్యము అంతకుముందె గజపతు లావరించుకొనుటయు జంద్రగిరి, పెనుగొండ, గండికోట రాజ్యములు సాళ్వ నరసింహభూపాలుని స్వాధీనమునందుంటయు గర్నాటరాజ్య దుర్బలస్థితికి దార్కాణములుగ నుండెను. ఈ స్థితిగతులలో బహమనీ సుల్తానులు కర్ణాట రాజ్యమును హరింప సిద్ధముగా నుండియు సాళ్వ నరసింహ భూవిభునిధాటికి వెఱచి యూఱకుండిరి.

'విద్యానగర రాజ్యము నుపేక్షించినచో యవనులు హరింపక మానరు. విద్యారణ్యాది మహానుభావులు తమశక్తి