పుట:Andhraveerulupar025958mbp.pdf/159

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ధారవోసి నెలకొల్పిన యీమహారాజ్యమును గోలుపోతిమేని ఆర్షధర్మము లంతరించి దేశమంతయు సంక్షోభ మొందకమానదు, అని సాళ్వనరసింహరాయడు తలంచి తనక్రింద దుర్గాధ్యక్షుడుగానున్న తుళువనరసరాయలను బిలువనంపి విద్యానగరరాజ్యమును ముట్టడింపుమని యాజ్ఞాపించి తనయొద్దనున్న సైన్యమునంతయు సహాయముగా బంపెను. నరసరాయడు తనబాలమిత్రుడును రాజ్యకార్య విశారదుడును సంగరకౌశలుడు నగు తిమ్మరుసుమంత్రిని సహాయముగా గైకొని యొక శుభముహూర్తమున విద్యానగరమును ముట్టడించెను. సాళ్వనరసింహ భూపాలుని ధర్మపరిపాలనము నందు అభిమానముగల సేనానాయకులు నరసభూపాలునకు స్వాగతము నొసంగి విద్యానగర సామ్రాజ్యమును స్వాధీనపఱచిరి. తుళువనరసరాయలు మేళతాళములతో రాజవీధులలో నూరేగుచు నగరములోనికి వచ్చుచుండెను. ఒకభటుడు రాజమందిరములోనికి బోయి భోగపరాయణుడగు విరూపాక్షరాయలకు "సాళ్వనరసింహభూపాలునిపంపున దుళువ నరసరాజువచ్చి సామ్రాజ్యము నంతయు లోబఱచు కొనుచున్నాడు. వీలున్న బ్రతకృతి గావింపు"మని విన్నవింపగా సంతోషభంగకరమగు నిట్టి సందేశము దెచ్చితివాయని భటునవమానించి బైటికి బంపెను.నరసరాజు తానుసాధించిన నగరభాగముల నన్నింటిని భటులకప్పగించి రాజమందిరము ప్రవేశించెను. నరసరాజు దగ్గరకు