పుట:Andhraveerulupar025958mbp.pdf/157

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గావించి గజపతి నెటులో తరిమివేసెను. గజపతి యంతతో బోళ చిక్కిన దుర్గములను జిక్కినటుల లోగొనుచు జంద్రగిరికి బోవగా సాళ్వనరసింహరాజు గజపతిని దన పాలనమునం దడుగిడనీయక సరిహద్దులవఱకు దరిమెను.

మల్లికార్జున రాయల తరువాత విరూపాక్ష రాయలు విద్యానగర సామ్రాజ్యపాలకు డయ్యెను. సహజముగా జంచల స్వభావుడును భోగపరతంత్రుడును నగు నీ రాజు రాజకీయ వ్యవహారములలో గొంచెమేని జోక్యము కలుగజేసి కొనక యెల్లపుడు భోగస్త్రీలతో గ్రీడించుచు సురాపానమత్తుడై యుండెను. ఈ యసమర్థుని తెలివితేటలు గమనించి మహమ్మదీయులు గోవాపట్టణము నాక్రమించికొనిరి. కపిలేంద్ర గజపతి యనంతరము విరోధిజన దుర్గమమని పేరొందిన విద్యానగర రాజ్యమును అతనికుమారు డగు పురుషోత్తమ గజపతి ముట్టడించి సైన్యమును నోడించి అపరిమిత ధనమును రత్న సమూహమును సింహాసనమునుగైకొని కటకము చేరెను. రాజ్యమునందు బరులు ప్రవేశించుట కిదియెమొదలు. తురుష్కుల దండయాత్రలతో గొంత రాజ్యభాగము గూడ బరాధీనము కానుండెను. గజపతి విద్యానగర సామ్రాజ్యమును గబళింప దగినంతబలమును సమకూర్చుచుండెను. ఏడులక్షల వఱకు దండ్రికాలమునం దున్న సైనికబల మంతయు దరిగిపోయెను. మూలధనముగా దండ్రి సేకరించిన ఎనుబదియైదు