పుట:Andhraveerulupar025958mbp.pdf/15

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

కటకేశ్వరుని భటులు కోటనుండి బయటకు వచ్చి యొక్క మాటు కందార సైనికుల నురుముచేయ సంకల్పించిరి. పరిస్థితులన్నియు విషయముగా నుండుటయు విజయము వ్యతర్దుల యెడ గానవచ్చుటయు దలంచి చేయునది లేక సోమరాజు వెంటనే తన సైన్యమును వ్రుత్యర్దులు ముట్టడింపక ముందే కందారమునకు బోవ నాగ్న్యాపించి విధిలేక తానును మరలి పోయెను. సోమరాజు సైన్యము మిగుల నిరుత్సాహముతో మరలి కందారము త్రోవబట్టెను. జయాపజయములు దైవాధీనములనుట యధార్ధము. కటకేశ్వరుని సైన్యము మిగుల నుత్సాహముతో బయలు వెడలి వచ్చెను. దుర్గము చుట్టును రాసులు రాసులుగ బీనుంగులు నిండిఫోయెను. సోమరాజు, నాతని సైన్యము కందార త్రోవ బట్టినటుల గ్రహించి కటకేశ్వరు డానందించి విజయకేతనము నెత్తించెను. కటకేశ్వరుడు విజయోత్సముల మిగుల వైభవముతో గావించి తోడిరాజన్యుల గౌరవించి పంపుచు గొలది కాలములో గందార రాజ్యముపైకి దండివెడలవలయుననియు బలములతో సర్వసిద్ధముగ నుండవలయుననియు బేరు పేరు వరుసల సేనాలకు దెల్పి వీడ్కొలిపి తాను సంగ్రామ ప్రయత్నములుగావించు చుండెను. సోమరాజు హతశేషమగు స్వల్ప బలముతో మిగుల విచారముతో నగరము జేరెను. మంత్రులు, పౌరులు,