పుట:Andhraveerulupar025958mbp.pdf/16

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

సోమభూపాలున కెదురేగి నమస్కరి0చి గతమునకు విచారి0ప బనిలేదనియు గట కేశ్వరుని వద్ది0ప నుపాయముల నరయుదమనియు ననేక విధముల దెల్పిరి. వీరపత్నియగు సిరియాల దేవి నాయకున కెదురేగి వికసితకునుమదామము క0ఠమున నల0కరి0చి పాదముల గడిగి శిరమున జల్లుకొని రాజన్యా గెలుపోదులు మానుషములు కావు. ప్రయత్నమునకు మాత్రము పురుషకారము కావలయును. క0ట్టమున బ్రాణ మున్న0తవరకు ద్వేషమును మరుమేని విజయము సాది0చుట దుష్కరకార్యము కాజాలదు. అని పౌరుషవాక్యములతో నాయకుని నుద్బోది0చెను. సోమరాజు పరాభవ మెరుగని వీరచూడామణీ. ఆ0ధ్రదేశమును శ0తిమ0తముగ బ్రజానుకూలముగ ధర్మబద్దముగ బరిపాలి0చిన ధర్మరాజు. కటకముదరి గడి0చిన యవజయ మాతని హ్రుదయమర్మముల భేది0చెను. రాజుమ0దిరమున చేరినదాది యాతని హ్రుదయమును నిట్టిదని నిర్వచి0పరాని విచారము ముట్టది0చెను. బుద్ది నిలుకడ దొల0గెను. ఈయా0దోళనములో ముని0గి సోమరాజు రాజ్యస్థితిగతుల బరిశీలి0ప మానెను. ధర్మమూర్తులగు మ0తులే విశ్వాసముతో రాజ్యపరిపాలనము నెట్టి లోపము లేకు0డ జాగరూకతతో గావి0పసాగిరి. సోమరాజు చి0తాజ్వర పీడితుడై ఆలోచనా సముద్రమున ముని0గి దారితెలియక తన్నుకొనుచు0డెను. క0దార


.