పుట:Andhraveerulupar025958mbp.pdf/148

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రులముందు వీరప్రతిజ్ఞ గావించెను. "మహమ్మదు సిరాజుద్దీన్" అనునొక భక్తుడు విజయము మనకు గలిగి తీఱునని పది దినము లేకధాటిగ ప్రార్థనములు గావించి పదునొకండవ దినమున యుద్ధమున కేగ మహమ్మదుషాహాను బ్రేరేపించెను. ఆ శుభముహూర్తమున మహమ్మదు షాహా సైయఫద్‌ద్దిను గోరి యనువానికి రాజ్యము నొప్పగించి యమితమగు బలముతో ననపోతానాయకుని బ్రతిఘటింప బయలువెడలి కొంత కాలమునకు గళ్యాణపురము జేరి యట ప్రయాణాయాసమును దీర్చికొని సైన్యము నెక్కువగా వెంటగొని పోయిన జాల కాలమగుటయే గాక వ్రయప్రయాసలు సైతము మిక్కుటముగ నగునని తలంచి వెంటవచ్చిన సైన్యములో జాలభాగము వెనుకకు బంపి నాలుగు వేలమంది యాశ్వికులను బదివేలమంది సైనికులను మాత్రము వెంటగొని యాంధ్ర నగరరాజమునకు జేరెను. మహమ్మదుషాహ కొంచెము ముందుగ నలువురు భటులనుబిల్చి ఓరుగల్లుద్వారముకడ నిల్చి ద్వారరక్షకులను బ్రమత్తులగావించి యేదియో వ్యవహారము బెట్టుకొని యున్నచో దా నాకస్మికముగ బలముతో వచ్చి ద్వారమును భేదింతునని చెప్పిపంపెను. నలువురు యవనులటులె యొరంగల్లు ద్వారముచెంత జేరి తాము గుఱ్ఱపు బేరగాండ్రమనియు ననపోతభూపాలుని కొఱకు గొన్ని యశ్వములను దూరదేశమునుండి కొనివచ్చితి మనియు