పుట:Andhraveerulupar025958mbp.pdf/147

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

బంపెను. దురాశయుడగు నాతడు గోలకొండ హద్దుజేసికొని మధ్యనున్న గ్రామము లన్నింటిని దోచుచు దురంతములు గావించుచు దేవాలయములను మత మందిరములను రూపుమాపుచు గొలదికాలమునకె ఒరంగల్లు సమీపించెను. మహమ్మదీయులబల మమితముగా నుండుటచేతను దమ సైనికులందఱు వ్యాధులచే గృశించియుంట వలనను సంగ్రామము గావింప నశక్తుండై యామహమ్మదీయవీరునితో ననపోతానాయకుడు సంధి కంగీకరించెను. సంధి నియమముల ప్రకారము రావలసిన రొక్కమునంతయు దీసికొని యవన నృపాలుడు గృహాభిముఖుడై త్రోవల గొట్టుచు నమితోత్సాహమున నిజనివాసంబున కేగి యేలికకు దన విజయ వార్త నంతయు నెఱింగించి యుచితసత్కారముల నొందెను.

'దినము మంచిదైన యూరెల్ల దొంగిలు' మన్నట్లు మహమ్మదుషాహ మఱల నేకశిలానగరమును ముట్టడింప వలయునని యుద్దేశించెను. ఇంతలో గొందఱు మహమ్మదీయులు మహమ్మదుషాహ సమ్ముఖమున కేగి యనపోతనాయకుడు తమయొద్ద గొన్ని యశ్వములను గొని సరియగు వెల నొసంగక యవమానించెననియు బ్రతిక్రియ గావించి యవమాన దు:ఖమును వారింపుమనియు ననేకవిధముల వేడుకొనిరి. మతావేశపరుడగు మహమ్మదుషాహ వారల కభయ హస్త మొసంగి యాంధ్రరాజన్యుని బంధించి తీరెదనని పకీ