పుట:Andhraveerulupar025958mbp.pdf/149

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

భాషించు చుండగా ద్వారరక్షకు లావార్తలు నిజములని విశ్వసించి యుచితవిధుల మఱచి వారితో బ్రసంగించు చుండిరి. ఇంతలో నాకస్మికముగ మహమ్మదీయ సైన్యమువచ్చి ద్వారమును సమీపించి లోన బ్రవేశించెను. ద్వారపాలకు లులికిపడి ద్వారములు బంధింప బ్రయత్నించిరి. గాని దృడతరములగు నాద్వారములు వేయుట యసాధ్యమయ్యెను. ప్రచ్ఛన్నముగ భాషింపుచున్న యానలువురు యవనులు నిలువుటంగీలలో గుప్తముగనున్న కరవాలములబెఱికి ద్వారపాలకుల వధించిరి. ఆ యదనున మహమ్మదుషాహ బలములన్నింటిని ద్వారము నుండి పురములోనికి గొనిపోయెను. స్వామిభక్తుడును విక్రమశాలియునగు (నాగనాయడు) నాగయ రుద్రదేవుడు వారల నెదిరించి పురద్వారముచెంత నడ్డగించి సమీపమున గల బురుజునాశ్రయించి స్థిరముగ నిలువబడెను. మహమ్మదీయు లాధీరుని ధాటికాగజాలక బురుజునకన్నివైపులమంటలబెట్టి యీటెలతో బైనున్న నాగయ రుద్రదేవుని క్రుమ్మిరి. చాలసేపు ప్రతిపక్షుల దురంతములకు బ్రతిక్రియ గావించి కావించి యలసి జాఱి యగ్నిహోత్రమునబడి యావీరుడు వీరమరణము నొందెను.

ఎంతయో ప్రయాసపడి యవనసైనికులు పురములో బ్రవేశించిరి. ఆంధ్రవీరులు కోటగోడలమీదను బురుజులమీదను మేడలమీదను నిల్చి యవనదళములపై విచ్చల