పుట:Andhraveerulupar025958mbp.pdf/146

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నొసంగుదు' నని చాలకాలము గడపి రాజ్యమునం దశాంతి నెలకొల్పు నుద్యోగుల దొలగించి ప్రభుభక్తిపరాయణులు విశ్వాసవంతులు నగు నూతనోద్యోగుల కధికారపదవుల నొసంగి పౌరులపై గ్రొత్తపన్నులు విధించి బొక్కసము క్రమక్రమముగా వృద్ధిగావించి సైనికబలమును స్వల్పకాలములోనె మిగుల నభివృద్ధిలోనికి దెచ్చెను. వంచనోపాయముతో దనబలము సంగ్రామమునకు జాలినంత సమకూర్చికొని యాంధ్రులగు రాయబారుల జూచి 'మీరు స్వస్థానముల కేగ వచ్చును. కొలదికాలము సైనికులతో మేము స్వయముగా వచ్చి మీరాజన్యులకు బ్రత్యుత్తరము నొసంగెద' మని మహమ్మద్‌షాహా వారిని పంపివేసెను. 'పదునెనిమిది మాసములుంచికొని చెప్పవలసినసంగతి యిదియా' యని యా నవాబును దెప్పి చేయునదిలేక కలరూపునంతయు దమరాజన్యుల కెఱింగించి సంగ్రామప్రయత్నములో నుంట మేలని వా రిరువురు నిజనివాసములకు జేరిరి. అనపోతనాయడు మహమ్మదుషాహా దురంతము విని యాగ్రహించి సంగ్రామ ప్రయత్నములు చేయుచు బలముల నన్నింటి నొరంగల్లు దుర్గమునకు జేర్చెను. బుక్కరాయలు కొంత సైన్యమును ననపోతనాయని సహాయార్థమై యోరుగంటికి సకాలమునకు బంపెను.

మహమ్మదుఖాను ఓరుగల్లు ముట్టడించుటకై యమితమగు సైన్యము నొసంగి సైన్యాధిపతియగు బహదూరుఖానును