పుట:Andhraveerulupar025958mbp.pdf/145

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బుక్కరాయలు, రాచకొండ పరిపాలించు ననపోతరాజు గ్రహించి సమీపముననున్న యవనుని మట్టుపెట్టుట కెంతయో యత్నించుచుండిరి.. ఇంతలో అల్లాఉద్దీన్ షాహ క్రీ.శ. 1358 లో గతించెను. అతని రెండవకుమారుడగు మహమ్మద్‌షాహ పితృరాజ్యమునకు వచ్చెను. ఆనూతనుని పరిపాలనమున రాజ్యమం దశాంతి మెండయ్యెను. సేనానాయకులు రాజద్వేషముతో వర్తించుచుండిరి. ప్రజలుగూడ రాజుపై నసూయ జూపసాగిరి. ఈస్థితిలో నాతనితల్లి మల్లికాజెహాన్ విశేషముగ ద్రవ్యము సైన్యము దీసికొని మక్కా మదీనా యాత్రలు గావించుటకై తురుష్కదేశమున కేగెను. ఈ సందిగ్ధస్థితి గనిపెట్టి బుక్కరాయలు, అనపోతనాయడు నైకమత్యము వహించి మహమ్మదీయరాజ్యము నంతము నొందింప నిశ్చయించుకొని మహమ్మదుషాహ సంస్థానమునకు జెరియొక రాయబారిని బంపుచు 'మీతండ్రిహరించిన మాయాంధ్రదేశములోని భాగములు మాకు వదలివేయవలయును, లేకున్నచో మేమిరువురము మీరాజ్యముపైకి సంగ్రామమునకు రానున్నార' మను సందేశమును దెలుప బంపిరి.

రాయబారు లిరువురు కలుబరుగ జేరి మహమ్మదుషాహాను సందర్శించి తమరాజన్యుల సందేశమునంతయు నివేదించిరి. సందిగ్ధావస్థలోనున్న మహమ్మదుషాహ యేమియు బ్రత్యుత్తరము జెప్పజాలక 'యిదిగో అదిగో ప్రత్యుత్తరము