పుట:Andhraveerulupar025958mbp.pdf/144

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

సీ|| "పరశురాముడు తండ్రి . పగ సాధ్యముగ జేసి
           తరతరము నృపుల . తలలు నఱకె
     సగరుండు తండ్రికై . పగగిని రోషించి
           తాలజంఘాదుల . తలలు రాల్చె
     దఱిమి యశ్వత్థామ . తండ్రికై యెంతయు
           నల పాండుసైన్యంబు . తలలుద్రుంచె
     మహిమీద సింగయ . మాధవోర్వీశుడు
           తండ్రికై రాజుల . తలలుగోసె

గీ|| గాక యబ్బంగి సంగరాం . గణములందు
     వైరివీరుల గెలువ నె . వ్వాడు చాలు
     దనర భార్గవ నగరులు . ద్రౌణి రావు
     మాధవుడుదక్క శూరులు . మఱియు గలరె||"

ఆకాలమున మహారాష్ట్రదేశములోని చాలభాగము, ఆంధ్రదేశములోని కొలది భాగమును తనయధీనమునందుంచుకొని అల్లాయుద్దీన్ షాహయను మహమ్మదీయుడు కలుబరిగి ముఖ్యపట్టణముగ రాజ్యముపాలింప దొడంగెను. విద్యానగరమునకు ననపోతనాయని రాజ్యమునకు దనరాజ్యము సరిహద్దులలో నుంటచే గాలము గనిపెట్టి యారెండురాజ్యములలోని దుర్గములను అల్లాఉద్దీను గొన్నింటిని స్వాధీనము గావించికొనెను. సరిహద్దులలోనుండి యామహమ్మదీయుడు గావించు దుర్నయము నంతయు విద్యానగరము బరిపాలించు