Jump to content

పుట:Andhraveerulupar025958mbp.pdf/137

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నాగ్నేయ యంత్రముల నెలకొల్పి ప్రతిపక్షులరాక కెదురు చూచుచుండిరి.

అనపోతనాయనికి సామంతులై యుండనోపని రెడ్డివారు, కమ్మవారు, రాచవారు, నినుగుర్తి దుర్గపాలకులకు దోడ్పడి సంగ్రామమున కాయితమైరి. అన్ని ప్రదేశములనుండి యరుదెంచిన యారాచవారిబలము 5,60,000కు మించి యుండెను. అనపోతనాయకుని ప్రభుత్వము విధ్వంసము గావింప వలయునని రాచవారును, రాచవారి విజృంభణము నశింపజేయ వలయునని వెలమవారు విక్రమించి ఘోర సంగ్రామమును గావింపనాయతమైరి.

విశ్వాస పాత్రులును స్వామిభక్తులునగు వెలమసేనా నాయకులు బహిరంగ స్థలమునందుండియు దుర్గములయందు దాగి యగ్నిగోళములను కుమ్మరించి సైన్యము నంతయు నురుముగావించుచున్న రాచవారికి లొంగక విజృంభించి దుర్గద్వారముల భేధింపదొడగిరి. రాచవారు బలముల నన్నింటిని దుర్గద్వారము చెంతజేరి ద్వారము పగిలిపోయినచో బ్రతిపక్షసైన్యమును బ్రతిఘటింపవచ్చునని సంగ్రామప్రయత్నముల గావించుచుండిరి. అనపోతానాయకుడు, మాదానాయకుడు మదగజంబుల నారోహించి ద్వారమును పొడిపింపసాగిరి. గజశిరోఘాతములచే ద్వారము భిన్నమగుచుండెను. గజముల శిర:ప్రదేశము లాద్వారపుగుబ్బలు తగులుటతోడనే