పుట:Andhraveerulupar025958mbp.pdf/136

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

తన ఖడ్గధారల దునిగినవారల స్వర్గంబున కనిపి, తన రేచర్ల గోత్రోద్భవుల కాచంద్రతారార్క మభ్యుదయాభివృద్ధి కలుగునట్లు దేవీ వరంబుబడసి ......" అనపోతానాయ డొనరించిన జల్లెపల్లి క్షేత్రవీరవిహార మీగద్యమువలన విదితము కాగలదు.

క్షత్రియవీరులు సారెసారె కనపోతనాయనితో బ్రతిఘటించి వీరమరణము నొందుచుండిరి. ఆకాలమున నినుగుర్తియను నొక దుర్గమును పూసపాటివారి సంబంధులగు క్షత్రియులు పరిపాలించు చుండిరి. స్వతంత్ర శీలురగు నారాచవారు బలముల నాయితము జేసికొని యనపోతానాయకునితో బ్రతిఘటింప నెంచిరి. నాటివారినందఱ సామంతులను గావించికొని యావదాంధ్రదేశము నేకచ్ఛత్రముగ బరిపాలింప సంకల్పించిన యనపోతనాయడు రాచవారినడంప సంకల్పించి తమ్ముడైన మాదానాయకునకు సర్వసేనాధిపత్యము నొసంగి సంగరమునకు బయనమయ్యెను. మాదానాయకునితో 60000 కాల్బలములు, 20000 ఆశ్వికులు, 7000 ఏనుగులు, 10000 సేనానాయకులు రణమునకు బయనమైరి. సైన్యమును ముందు నడపుచు ననపోతానాయకు డొక యున్నత గజమునెక్కి పోవుచుండెను. వెలమసోదర వీరుల విజృంభణము నంతయు జారులవలన నాలకించి రాచవారందఱు యుద్ధమునకు సన్నద్ధులై బురుజులపై వీరవర్యులనిల్పి ద్వారముల కుభయపార్శ్వముల