పుట:Andhraveerulupar025958mbp.pdf/135

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

"బిరుదునకై వసించు నిందువంశపు రాజులు ఐదులక్షల యిరువదివేలు బలంబులతో ద్రిభువనరాయ బిరుదాంకుండని యెఱుంగక జిల్లెపల్లి వీరక్షేత్రంబున నెదిరించిన అఱువదివేల గుఱ్ఱంబులతోను, ఏనూరు మత్తేభంబుల తోడను, పదిలక్షల కాల్బలంబులతోను నెదురునడచిన పద్మజులకును తెనుంగులకును గంధ కస్తూరీ పరిమళద్రవ్యంబు లొసంగి తమ్మెదిరించిన యహంకార మహామానుష భార్గవులైన పద్మజులను రణరంగ దుర్జయులైన తెనుంగులను రణోత్సాహులై వీరసాహ సాహంకారంబులతోను మెఱయు రాజులను కమ్మనాయకులను రంకెలువైచు బిరుదురాహుత్తులను సముఖపు చరుపర్లతో గూడి కలహమందు నుగ్గునుగ్గాడి నూటొక్క రాజులశిరములు ఖండించి యెనుబది యొక్క రాజుల కీకసంబులుగా నుగలాడించి, పదియుమువ్వురు రాజుల రణబలిగావించి, ఆ రణక్షోణినర్చించి దిగంబరుడై కాళీ, మహాకాళీ, శాకినీ, డాకినీ భూతప్రేత పిశాచాలం దలంచి రణదేవ పోతరాజ కలహకంట కాది దేవతల నారాధించి ధ్యానించి రణరాజ రణశూర రణవీరాది నిజబలంబులకు జయంబు గలుగునట్లుగా వైరిరాజులను బలిగావించి బట్టురాజును తానును రణంబు గుడిపి తనవీరాధివీర సాహసంబులు పొగడించుకొని