పుట:Andhraveerulupar025958mbp.pdf/117

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చంద్రగిరి రాజ్యములు కలిసియుండెను. ఈరాజ్యములు రెంటిని గలిపి హరిహరరాయల సోదరులలో నొకరు పాలించుచుండిరి. మూడవది ఆరగమలె రాజ్యము. ఇందు వనవాసి, చంద్రగుత్తి, గోవారాజ్యములు చేరియున్నవి. ఇందు గొంత బాగమును మారభూపాలకుడు గౌడబ్రాహ్మణుడగు మాధవమంత్రిని సచివునిగా నుంచుకొని నుంచికొని పాలించుచుండెను. షిమొగజిల్లాయను, ఉత్తరకన్నడ జిల్లాయును గలసి ఆకాలము నందు ఆరగమలెమండల మనుపేరుతో వ్యవహరింప బడుచుండెను. నాలుగవది ములువాయిరాజ్యము. ఇది మద్దభూపతి పరిపాలనమునం దుండెను. ఐదవది తుళురాజ్యము. ఇందు బరకూరు, మంగటూరు చేరియుండెను. దీనిని హరపాదగౌడ రా జనునాతడు మంత్రిగానుండి పాలించుచుండెను. ఆఱవది రాజగంభీర రాజ్యము. దీనిని బుక్కరాయల కుమారుడగు కుమార కంపరాయలు పాలించుచుండెను. ఈవిధముగా రాజ్యము ఆఱుఖండములుగా విభజింప బడుటచే బరిపాలనమునకు సుకరముగా నుండి విరోధులకు దుర్గమముగా నుండెను. వలసిన తావులకు విద్యానగరమునుండి సైన్యము, ధనము సకాలమునకు జేరునటుల నేర్పాటులు చేయబడెను. అందుచే జిన్నరాజులెవరును రాజ్యములోని భాగములనేని దేరిచూడ లేకపోయిరి.