పుట:Andhraveerulupar025958mbp.pdf/116

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తముగా నుంటచే విద్యానగరరాజ్యమె మనకు శరణ్యమని పలువురు ప్రజలు దక్కను భూములను విడిచి కర్ణాట రాజ్యమునకు వచ్చిరి. హరిహరరాయల కాలమున బ్రసిద్దు డైన నాచన సోమనాధమహాకవి పెక్కుగ్రంథముల నాంధ్రభాషలో రచించెను. ఈకవి హరిహరరాయల రాజ్యకాలమునం దుండి బుక్కరాయలచే బంపాసరోవర సమీపమునందున్న విరూపాక్షస్వామి సన్నిధానమునందు బుక్కరాయ పురమును అగ్రహారముగా బడసెను. ఆంధ్రకవులకు విద్యానగరమునకు జిరకాలమునుండి సంబంధము గలదనియు గర్ణాటరాజ్యాధీశ్వరు లనబడు విద్యానగర ప్రభువులందఱు ఆంధ్రకవుల బోషించి భాషను బెంపొందించిరనియు జెప్పుటలో గొంచెమేనియు నతశయోక్తి యుండదు. ఆనా డింక నెందఱు కవులు మహారాజు ప్రాపు బడసి సుఖముగా జీవించిరో తెలుపు నాధారములు లేవు.

హరిహరరాయల కాలమున విద్యానగరరాజ్యము ఆఱు భాగములుగా విభజింపబడి యుండెను. అందు ఉదయగిరి రాజ్యమొకటి. ఈరాజ్యమును దొలుత కంపభూపతియు నతని యనంతరము పెద్దకుమారుడగు సంగమరాజు, శావన్న యొడయలు బాలించిరి. విద్యారణ్యుల సోదరుడగు సాయనాచార్యులు సంగమరాజునొద్దమంత్రిగానుండి నెల్లూరునందు నివసించుచుండెను. రెండవది పెనుగొండరాజ్యము. ఇందు గుత్తి,