పుట:Andhraveerulupar025958mbp.pdf/118

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

హరిహరరాయల జననకాలము గుర్తింపదగు నవకాశములులేవు. ఆయన రాజ్యమునకువచ్చి విద్యానగరమునందు బట్టాభిషిక్తుడై క్రీ.శ. 1336 నుండి క్రీ.శ. 1355 వఱకు పందొమ్మిది సంవత్సరములు పాలించి పరలోక మలంకరించెను. యువరాజుగ నుండి పేరొందిన బుక్కరాయలు అన్నగారు మరణించినవార్త వినినవెంటనే హోసపట్టణమునం దొక ప్రతినిధిని నిలిపి తాను విద్యానగరరాజ్యమునకు వచ్చి పట్టాభిషిక్తు డాయెను.

బుక్కరాయలు పరాక్రమాదికమున హరిహరరాయల కించుకేనియు దీసిపోవువాడు గాడు. విద్యానగర రాజ్యమున కీతడు పాలకుడుగా వచ్చుసరికి బహమనీసుల్తాను మహమ్మదుపాదుషా, ఓరుగల్లు ప్రాంతములను బరిపాలించు అనపోత భూపాలుని యేలుబడిలోనున్న భువనగిరి, గోలకొండ దుర్గములను వారించి కర్ణాటరాజ్యమును లోగొనుటకు సిద్ధముగా నుండెను. బుక్కరాయలు ముందున కడుగుబెట్టకుండ సరిహద్దుల నెన్నివిధముల గాపాడుచున్నను మహమ్మదుషా విజయనగరముమీదికి దండయాత్రకు అపరిమితబలముతో వచ్చి ఘోరసంగ్రామము గావించెను. కడకు బుక్కరాయలె జయించుటచే మహమ్మదీయులు నష్టావశేషమగు సైన్యముతో నింటిత్రోవ బట్టిరి. బుక్కరాయలు పరాజయము నెఱుంగక వీరవతంసమని పేరొంది ప్రతి సంగరమునందును జయమెవడ