పుట:Andhraveerulupar025903mbp.pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

లచే నీ పాటలీపుత్రము పవిత్ర మొనర్పబడియెను. మన కథాకాలమున నీ రాజ్యమును మహాపద్మనందుడు తన యెనమండ్రు కుమారుల సాయముతో బాలించుచుండెను. మహాపద్మునకు ఇళ, ముర యను నిరువురు రాణులు గలరు. ఇళ యందు ఎనిమిదిమంది కుమారులు జనించిరి. మహాపద్మునితో గలిపి వీరిని నవనందు లని యాకాలమున బేర్కొనుచుండిరి. రెండవ భార్యయగు మురయందు జన్మించిన వాడు చంద్రగుప్తుడు. తేజశ్శాలియు బుద్ధిమంతుడు నగు చంద్రగుప్తునియెడ సవతియన్న లెనమండ్రును పగ బూని యెటులేని మట్టుపెట్ట జూచుచుండిరి. మహాపద్ముడు ముదుసలియగుట చేతను జంద్రగుప్తుడు మిగుల జిన్నవాడగుట చేతను, రాజ్యభారమంతయు ఎనమండ్రునందులకు గైవసమయ్యెను. చంద్రగుప్తుని మట్టు పెట్ట నెన్నియో కపటోపాయములను బన్నుచు నందులెనమండ్రు దురాలోచనము జేయుచుండిరి. చంద్రగుప్తుడు మిగుల శ్రమలందుచు దైవ సహాయమున నెటులో యాపదనుండి గట్టెక్కుచు గాలయాపనము దినమొక యేడుగ జేయుచుండెను. కడకు జంద్రగుప్తుడు పొట్టకూటికి వెరవు చాలక సత్రాధికారిగనుండి దీనుడై కాలము గడుపుచుండెను.

నందు లహంకరించి మహామంత్రియు నేర్పరియునగు రాక్షసుని మాటనేని పాటింపక మిగుల స్వతంత్ర భావముతో వర్తించుచుండిరి. ఒకదినమున చాణక్యు డను