పుట:Andhraveerulupar025903mbp.pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీరస్తు.

ఆంధ్ర వీరులు.

1. చాణక్యుడు.

భరతఖండమునందలి దేశములన్నిటెలో మగధ మిగుల బ్రసిద్ధమైనది. మగధదేశము చిరకాలము వీరాధివీరులు, పరాక్రమశాలురు, ధర్మస్వరూపులు నగు రాజులకు రాజధానిగ నుండెను. పాండవులను శ్రీకృష్ణుని ఉఱ్ఱూతలూపిన వీరవతంసుడగు జరాసంధుని రాజధాని యీ మగధదేశమందలి గిరివ్రజము. దీనిచెంతనే బింబిసారుడు రాజగృహ మను నగరమును నిర్మించెను. తరువాత గొంతకాలమునకు అజాతశత్రుడు రాజ్యమునకువచ్చి గంగాతీరమునందున్న పాటలియను నొక పల్లెచెంత గొప్ప దుర్గమును గట్టెను. అతని మనుమడగు ఉదయనుడు పాటలీదుర్గముచెంత పాటలీపుత్రమను గొప్పనగరము నిర్మించెను.

పాటలీపుత్రము గంగ, శౌణ, గోగ్ర మొదలగు నదులు సంగమస్థలము చెంత నిర్మింపబడెను. బుద్ధాది మహానుభావు