పుట:Andhraveerulupar025903mbp.pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పూర్వాంధ్రదేశము ధరణికోట రాజధానిగా శాతకర్ణి పరిపాలనము క్రిందను నుండెను. శాసనములవలన గౌతమీపుత్రశాతకర్ణి ఆస్మిక, ఆసిక, మూలక, సురాష్ట్ర, కుకుర, అపరాంతక, అనూప, విదర్భ, అకరావంతి లోనగు దేశముల కధిపతియనియు వింధ్యావతము, పారియాత్రము, సహ్యము, కృష్ణగిరి, మలయము, మహేంద్రము, శ్రేష్ఠగిరి, చకోరము, మొదలగు పర్వతముల కధినాధుడుగా నుండెననియు దెలియుచున్నది. మగధదేశమునకు గూడ ధరణికోట యాకాలమున రాజధానిగానుండెను. ఉత్తరదిశను గంగానదిమొదలుకొని దక్షిణమున గాంచీపురివఱకు గల దేశమంతయు నాంధ్ర రాజుల పరిపాలనమున నున్నటుల నిశ్చయింప నవకాశములు గలవు.

శాతకర్ణి యాంధ్రుడైనను అతని కాలమున వ్యాప్తిలో నున్న ఆంధ్రభాషాస్వరూప మెట్టిదో నిశ్చయింప నాధారములు లభించుటలేదు. రాజకీయవ్యవహారములయందును శాసనములయందును సంస్కృతభాష మిగుల స్వల్పముగను విశేషముగ బ్రాకృతయు నుపయోగింపబడెను. శాతకర్ణి ప్రాకృతవాజ్మయమును మిగుల నభివృద్ధిలోనికి దెచ్చెను. ప్రాకృతభాషలో బెక్కు లుత్తమగ్రంథము లీనృపాలునికాలమునందే బయలు వెడలెను. విదేశవ్యాపారమునుగూడ నీతడు మిగుల నభివృద్ధిలోనికి దెచ్చి ద్వీపాంతరముల కిచటివస్తువులు పోవునట్లును