పుట:Andhraveerulupar025903mbp.pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వారికి గూడ నీరాజు మిగుల సహాయము చేసెను. ఆ కాలమున బేరుగల రాజ్యము లన్నియు శాతకర్ణునకు బన్నుగట్టుచుండెను. శాతకర్ణుడు బౌద్ధమతావలంబియైనను విరోధిసంహారమున దయాదాక్షిణ్యములు వదిలి యెన్నియో కుటుంబములను రూపుమాపెను. తనకు దిరుగబడి సామంతులుగా నుండనీయ కొననందులకు గోపించి విరోధుల వంశములను నిర్మూలము గావించెను. యవన శక పహ్లావవంశములు పెక్కు రూపుమాపెను. సౌరాష్ట్రదేశముమీదికి దండెత్తి యాభాగమును బాలించు రాజవంశమును కూకటివ్రేళ్లతో బెరికి కూలార్చెను. పలువురు రాజులు శాతికర్ణికి లోబడి తమపూర్వమతములు వదలి బౌద్ధులుగా మాఱిపోయిరి. ఇతని పుత్రుడగు పులమాయి (పౌలోమి) గూడ విజయ యాత్రల యందు దండ్రికిదోడ్పడి విజయములు సమకూర్చి సామ్రాజ్యమును మిగుల విస్తరము గావించెను.

శాతకర్ణుని రాజ్యమును హరింపదలంచి యవనులు, శకనులు, పహ్లవులు పలుమారు దండెత్తివచ్చి పరాభవము నొంది పోవుటయేకాని జయము నొకమాఱేని గాంచి యెఱుంగరు. ఆకాలమున సుప్రసిద్ధులుగానున్న చేరదేశపాలకుడగు చెంకుడువాను భూపతియు సింహళమును బాలించు గజబాహునృపుడును మాళవదేశమును బరిపాలించు చస్తనుడును శాతకర్ణి కనుసన్నల మెలగుచు స్నేహము వాంఛించుచుండిరి. పశ్చిమాంధ్రదేశము పులమాయి యధికారము క్రిందను