పుట:Andhraveerulupar025903mbp.pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కూర్చుండియుండెను. దీపకర్ణి స్వప్నమున గాంచినదెల్ల ప్రత్యక్షమగుటచే మిగుల సంతసించి పదునైన బాణమును వెంట సంధించి పరుగెత్తు సింగముపై బ్రయోగించెను. సింగము వెంటనే మరణించెను. సింహ దేహము నుండి యక్షుడొకడు బయలు వెడలి నమస్కరించి దీపకర్ణి నృపాలా! నేను సాతుడను వాడను. యక్షుడను. కుబేరుని సఖుడను. నే నొకముని కన్యను వలచి మునియనుజ్ఞ గొనకమున్ను గాంధర్వవిధి బెండ్లాడితిని. నాసాహసమునకు గోపించి మమ్మిరువుర సింగముల గండని ముని శపించెను. నాభార్య గర్భవతియై యీ బాలుని గని యకాలమరణ మొందెను. తల్లిలేని బిడ్డనెటులో పెంచుచుంటిని. నాశాపము తొలంగినది. నే నేగుచున్నాడను. ఈబాలుని పోషించు భారమంతయు నీదెయని సాతు డదృశ్యమయ్యెను. సాతుడే వాహనముగనున్న యా బాలకునకు సాతవాహనుడను నామమొసంగి దీపకర్ణి యాబాలుని మక్కువతో బెంచి పెద్దవాని గావించి శుభదినమున దన రాజ్యము నాబాలకున కొసంగి పట్టాభిషేకము గావించెను. సాతవాహనునే ప్రాకృత గ్రంథములందు శాలివాహనుడని వ్యవహరించిరి. ఈతని వంశమె శాతవాహనవంశమని వ్యవహరించుచుండిరి.

శాతకర్ణుడు బౌద్ధుడు. అతనికాలమున జైనబౌద్ధ శైవమతములు పరస్పర భిన్నాభిప్రాయములతో ద్వేషము పెంచుకొనుచున్నను దానందు బాల్గొనక సర్వమత సామరస్యమునకె పాటుపడెను. బౌద్ధభిక్షువులకేకాక యితరమతముల