పుట:Andhraveerulupar025903mbp.pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రాక్షసుడు విని నిరపరాధియు దన ప్రాణమిత్రుడు నగు చందనదాసునకు దన మూలమున ఘోరమరణము ప్రాప్తింప దున్నందులకు మిగుల వగచి యెటులేని యంత్యకాలమునందేని పరమ విశ్వాసపాత్రుడగు చందనదాసుని గలిసికొని తన ప్రాణము లొసంగియేని యాతని గాపాడనెంచి వధ్యస్థానమునకు జేరెను. హంతకులు చందనదాసుని వధ్యస్థానమునకు జేర్చి యురిదీయబోవు తరుణమున రాక్షసు డడ్డుపడి నిరపరాధియగు చందనదాసుని వదలి నన్ను జంపుడని ముందునకు వచ్చెను. చాణక్యు డది యంతయు జూచి రాక్షసామాత్యా! నీవు చంద్రగుప్తునకు మంత్రిగానుండుటకు ఇష్టపడెదవేని దోషియగు చందనదాసుని వదలుదుము. లేకున్న ఉరిదీయక తప్పదని చెప్పెను.మిత్రసంరక్షణమె తన కవశ్యకర్తవ్యము గావున విథిలేక రాక్షసుడు చంద్రగుప్తునకు మంత్రిగానుండుట కంగీకరించెను. చంద్రగుప్తుడు రాజనీతివిశారదుడగు రాక్షసుడు మంత్రిగనుండుట కెంతయో సంతసించెను. తన ప్రతిజ్ఞలగు నందసంహారము, చంద్రగుప్త పట్టాభిషేకము నీవిధముగా ముగించి రాజ్యము బ్రశాంత మొనరించి చాణక్యు డాథ్యాత్మికవిచారము గావింపనెంచి రాజకీయరంగమునుండి తొలంగెను. గతము నంతయు మఱచి రాక్షసుడు చంద్రగుప్తునిచే ననేక దండయాత్రల నొనరింప జేసి పరాజయము నెఱుంగని విజయములతో పాటలీపుత్రరాజ్యమును మిగుల విస్తరింప జేయుటయేగాక